టెన్త్ ఫీజుల దోపిడీపై కడప ఆర్జేడీ ఆఫీస్ ముట్టడి

4చూసినవారు
పదో తరగతి పరీక్ష ఫీజుల పేరుతో ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్నాయని ఆరోపిస్తూ బుధవారం కడప ఆర్జేడీ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. రూ. 125 ఫీజుకు బదులుగా రూ. 1500 వసూలు చేస్తున్నారని, దీనిపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యాలకు సహకరిస్తున్న ఆర్జేడీని తొలగించాలని, ప్రభుత్వ పాఠశాలలను కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్