రైలులో చిన్నారిపై లైంగిక దాడి కేసులో కడప పోక్సో కోర్టు బుధవారం చారిత్రక తీర్పునిచ్చింది. నిందితుడు రామ్ ప్రసాద్ రెడ్డికి జీవిత ఖైదు, రూ. 10 వేల జరిమానా విధిస్తూ జడ్జి ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. బాధితురాలికి రూ. 10. 50 లక్షల పరిహారం చెల్లించాలని గుంతకల్ డిఆర్ఎంను ఆదేశించారు. విధుల్లో ఉన్న టీటీఐలపై చర్యలకు సిఫార్సు చేశారు. సాక్ష్యాధారాలతో శిక్ష పడేలా కృషి చేసిన రైల్వే హెడ్ కానిస్టేబుల్ నాగరాజును, పీపీలను ప్రశంసించారు.