కార్తీక మాసం సందర్భంగా, కడప డిపో మేనేజర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 5వ తేదీ బుధవారం నాడు నిత్యపూజకోన, శ్రీశైలం, పొలతలకు కడప పాత బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. పొలతలకు ఉదయం 6.30, 9.00, 11.30, మధ్యాహ్నం 2.15, 4.45 గంటలకు, నిత్యపూజకోనకు ఉదయం 6.30, 9.30, 12.30, మధ్యాహ్నం 3.30 గంటలకు బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.