కడప: హోంగార్డ్ సిబ్బంది సంక్షేమంపై ప్రత్యేక దృష్టి

4చూసినవారు
కడప: హోంగార్డ్ సిబ్బంది సంక్షేమంపై ప్రత్యేక దృష్టి
కడప జిల్లాలో పనిచేస్తున్న హోంగార్డుల సంక్షేమం కోసం ప్రత్యేక దృష్టి సారించినట్లు హోంగార్డు కమాండెంట్ ఎం. మహేష్ కుమార్ తెలిపారు. శనివారం ఉమేష్ చంద్ర కల్యాణ మండపంలో హోంగార్డ్ సిబ్బందితో నిర్వహించిన దర్బార్‌లో ఆయన మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు క్రమశిక్షణతో పోలీసులకు మద్దతుగా నిలవాలని సూచించారు. హోంగార్డ్ యూనిట్ ఇన్స్పెక్షన్ సందర్భంగా డ్రైవింగ్ లైసెన్స్, పిఎంజెజెబివై, పిఎంఎస్. బివై పాలసీలను అప్‌డేట్ చేసుకోవాలని సిబ్బందికి సూచించారు.

ట్యాగ్స్ :