కడప గడ్డి బజార్‌లోని శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం ధనుర్మాస పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన 'కూడారై' ఉత్సవంలో నగర మేయర్ పాక సురేష్ కుమార్ పాల్గొన్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని, పల్లకి సేవలో పాల్గొన్నారు. అర్చకులు విజయ్ బట్టర్ వేదాశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు రెడ్డయ్య, సాయి దత్త తదితరులు పాల్గొన్నారు.