వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు రహదారులపై ప్రమాదాల నివారణే లక్ష్యంగా "స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో" కార్యక్రమం కొనసాగుతోంది. అర్ధరాత్రి దాటాక లారీలు, బస్సులు, కార్ల డ్రైవర్లను నిలిపి పోలీసులు నీళ్లతో ముఖం కడిగిస్తున్నారు. డ్రైవర్లు తమ కుటుంబాల గురించి ఆలోచించి, నిద్రమత్తు వల్లే ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా వాహనాలు నడపాలని పోలీసులు సూచించారు.