కడప: రిమ్స్ ఠాణా ఎదుట ఒకరి ఆత్మహత్యాయత్నం

5చూసినవారు
కడప: రిమ్స్ ఠాణా ఎదుట ఒకరి ఆత్మహత్యాయత్నం
కడప రిమ్స్ పోలీస్ స్టేషన్ ఎదుట శుక్రవారం రామలింగారెడ్డి అనే వ్యక్తి స్థలం వివాదంలో పోలీసులు స్పందించలేదని ఆరోపిస్తూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసులు వెంటనే స్పందించి అతన్ని అడ్డుకుని రిమ్స్‌కు తరలించారు. చిన్నచౌకుకు చెందిన రామలింగారెడ్డి తన స్థలం విషయంలో రిమ్స్ పోలీసులు స్పందించలేదని వాగ్వాదానికి దిగి, వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకున్నారు. పోలీసులు అడ్డుకుని, అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్