కడప: బంకుల వద్ద అధికారుల పర్యవేక్షణ: ఆర్డీవో మురళి

2చూసినవారు
కడప: బంకుల వద్ద అధికారుల పర్యవేక్షణ: ఆర్డీవో మురళి
కడప డివిజన్‌లో ఇంధన కొరతను నివారించడానికి ఆర్డీవో మురళి ప్రత్యేక చర్యలు చేపట్టారు. బంకుల వద్ద నిఘా కోసం నోడల్ అధికారులను నియమించారు. ఇంధనాన్ని క్యాన్లు, బాటిల్స్‌లో అమ్మడాన్ని పూర్తిగా నిషేధించారు. ఇకపై బైక్‌లకు 5 లీటర్లు, కార్లకు 30 లీటర్లు, లారీలకు 50 లీటర్ల వరకు మాత్రమే ఇంధనం అందిస్తారు. వ్యవసాయ అవసరాలకు తహసీల్దార్ స్లిప్ తప్పనిసరి. ప్రజలు ఆందోళన చెందవద్దని, కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని ఆర్డీవో హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్