కడప: అమరవీరుల త్యాగాలు మరువలేనివి

4చూసినవారు
కడప: అమరవీరుల త్యాగాలు మరువలేనివి
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా, గురువారం సాయంత్రం కడప నగరంలోని మహిళా పోలీస్ స్టేషన్ వద్ద అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ సంగీత కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్. పి కె. ప్రకాష్ బాబు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, పండుగల సమయంలో ప్రజలు ఇళ్లలో ఉన్నప్పుడు పోలీసులు రోడ్లపై బందోబస్తు విధుల్లో ఉంటూ నిరంతరం ప్రజల పరిరక్షణకు అంకితమవుతారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్