కడప: శాకాంబరీ దేవి అలంకారంలో వాసవి మాత

53చూసినవారు
కడప: శాకాంబరీ దేవి అలంకారంలో వాసవి మాత
ఆషాడ మాసం సందర్భంగా కడప నగరంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శుక్రవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతకు శాకాంబరీ దేవి అలంకారాన్ని చేపట్టారు. బెంగళూరు, కడప నగరంలో కొనుగోలు చేసిన, దాతలు ఇచ్చిన కూరగాయలు 108 రకాలను ఉపయోగించారు. దాదాపు 1000 కేజీలను ఫలాలు, కూరగాయలను ఉపయోగించినట్లు నిర్వాహకులు తెలిపారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు, అభీషేకాలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్