చిత్తూరు జిల్లా వడ్డిపల్లికి చెందిన కృష్ణవేణి, 6వ తరగతిలో కరెంటు షాక్‌తో కాలు, చెయ్యి కోల్పోయినా, పేదరికాన్ని, వైకల్యాన్ని జయించి గ్రూప్-1 ఉద్యోగానికి ఎంపికైంది. ఇదివరకే గ్రూప్-2లోనూ సెలెక్ట్ అయిన ఆమె, కష్టపడితే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది. వేంపల్లె IIIT కాలేజీలో చదువుకున్న కృష్ణవేణి స్ఫూర్తిదాయక విజయం సాధించింది.