కడప: ఉర్దూ స్కూల్‌లో వాటర్ ప్లాంట్ మరమ్మత్తు

8చూసినవారు
కడప నగరంలోని గౌస్ నగర్ మునిసిపల్ ప్రాథమిక ఉర్దూ స్కూల్‌లో ఆర్‌ఓ వాటర్ ప్లాంట్ చెడిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న వార్తలకు అధికారులు స్పందించారు. నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం వెంటనే ప్లాంట్‌కు మరమ్మత్తులు చేయించింది. దీంతో సమస్య పరిష్కారమై, విద్యార్థులకు ప్రస్తుతం శుద్ధమైన తాగునీరు సరఫరా అవుతోంది. విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నామని మున్సిపల్ అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :