కడప: స్మార్ట్ పోలీసింగ్‌లో అగ్రగామిగా నిలవాలి

4చూసినవారు
కడప: స్మార్ట్ పోలీసింగ్‌లో అగ్రగామిగా నిలవాలి
స్మార్ట్ పోలీసింగ్‌లో కడప జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అన్నారు. శనివారం డీపీవోలో నేర సమీక్ష నిర్వహించిన ఆయన, డ్రోన్లు, ఈ-సాక్ష్య యాప్‌ల ద్వారా నేరాలకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. అసాంఘిక శక్తులు, రౌడీలపై కఠిన చర్యలు తీసుకోవాలని, నేరాలు పునరావృతమైతే పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, మహిళల భద్రతపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్