బుధవారం సార్వత్రిక సమ్మెలో భాగంగా ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కడప నగరంలోని స్థానిక సిఎస్ఐ చర్చి దగ్గర నుండి పెద్ద ఎత్తున ర్యాలీ ప్రారంభమై కోటిరెడ్డి సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, సెవెన్ రోడ్స్, గోకుల్ సర్కిల్, ఒకటవ గాంధీ సర్కిల్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్, మీదుగా సెవెన్ రోడ్స్ దగ్గర సభ నిర్వహించారు. కమ్యూనిస్టు పార్టీల నాయకులు మాట్లాడుతూ మోడీ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తాం అన్నారు.