కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ మంగళవారం జమ్మలమడుగులో నేర సమీక్ష నిర్వహించారు. మహిళా భద్రతపై గ్రామాలు, కాలేజీల్లో అవగాహన కల్పించాలని, గస్తీని పెంచాలని ఆదేశించారు. మట్కా, బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరిస్తూ, చట్టపరిధిలో నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచనలు జారీ చేశారు.