సుదీర్ఘకాలంపాటు పోలీస్ శాఖకు విశేష సేవలందించి పదవీ విరమణ పొందడం అభినందనీయమని కడప డి. ఎస్. పి ఎ. వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గురువారం కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో జులై నెలాఖరున పదవీ విరమణ పొందిన పోలీస్ సిబ్బంది ని శాలువా కప్పి సన్మానించి జ్ఞాపికలు అందచేసి ఘనంగా వీడ్కోలు పలికారు. పదవీ విరమణ పొందిన ఎ. రవిశంకర్, బి. ఆర్ నరసింహులు, సి. నాగశేషా రెడ్డిలను సన్మానించారు.