కడప నగర శివారులోని కోపర్తిలో ఈనెల 23, 24, 25 తేదీల్లో జరగనున్న ‘దీనీ ఇస్తిమా’ సభకు లక్షల మంది హాజరయ్యే నేపథ్యంలో, తాగునీరు, ట్రాఫిక్ నియంత్రణ వంటి మౌలిక వసతులను పకడ్బందీగా కల్పించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్. శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి, అహ్మద్ షరీఫ్ శనివారం కలెక్టర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ చైర్మన్ శ్రీనివాసమూర్తి, మన్సూర్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు.