లింగాల మండలం ఇప్పట్ల గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు సుధాకర్ రెడ్డి శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. కడపలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన తర్వాత గుండెపోటు రావడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. ఈ వార్త తెలిసి వైసీపీ నాయకులు బాబు రెడ్డి, మనోహర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.