రెండు దశాబ్దాలుగా ఉపాధ్యాయ ఉద్యమాల్లో క్రియాశీలకంగా పనిచేసిన మానుగుంట రవిశంకర్, నోబుల్ టీచర్స్ అసోసియేషన్ (NTA)లో చేరారు. మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు, NTA రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు శ్రీనివాసరాజు సమక్షంలో ఈ చేరిక జరిగింది. అనంతరం, రవిశంకర్ మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావులను కలిసి, విద్య, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రం సమర్పించారు. కడప జిల్లాలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి, NTA సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని రవిశంకర్ తెలిపారు.