అక్రమ కట్టడాలను అరికట్టాలి: అధికారులకు మేయర్ ఆదేశం

3చూసినవారు
అక్రమ కట్టడాలను అరికట్టాలి: అధికారులకు మేయర్ ఆదేశం
కడప మేయర్ పాక సురేష్ కుమార్ బుధవారం టౌన్ ప్లానింగ్ అధికారులతో బీపీఎస్, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా, టౌన్ ప్లానింగ్ విభాగంపై వస్తున్న విమర్శలను సరిదిద్దుకోవాలని, అక్రమ నిర్మాణాలను ఉపేక్షించవద్దని అధికారులను ఆదేశించారు. ప్రజల్లో బీపీఎస్, ఎల్ఆర్ఎస్ లపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, సీపీ శైలజ, ఏసీపీలు పాల్గొన్నారు. రిటైర్డ్ ఏటీఓ రామాంజనేయులు కూడా మేయర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్