బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిని గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి డా. దాసరి సుధ మేడం గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె రోగులతో మాట్లాడుతూ అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. జనరల్ వార్డు, ఓ.పి, రిజిస్టర్, డయాలసిస్ యూనిట్‌ను పరిశీలించి, పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీ రాజగోపాల్ రెడ్డి, మున్సిపాలిటీ అధ్యక్షుడు శ్రీ సుందర రామిరెడ్డి, వైస్ చైర్మన్ సాయికృష్ణ, జిల్లా కార్యదర్శి శ్రీ నాగేశ్వర్ రావు, మండల ఉపాధ్యక్షుడు శ్రీ శేఖర్ రెడ్డి, మున్సిపాలిటీ ఉపాధ్యక్షుడు శ్రీ సునీల్, కౌన్సిలర్ మౌలాలి, ఇతర నాయకులు పాల్గొన్నారు.