కడప నగర అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, 13వ డివిజన్ ఓం శాంతినగర్ 'ఏ' క్రాస్ రోడ్డు వద్ద నూతన రోడ్డు పనులకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే మాధవి రెడ్డి భూమి పూజ చేశారు. మౌలిక సదుపాయాల కల్పనతో కడప నగరం రూపురేఖలు మారుస్తామని, నాణ్యతతో పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.