ఇంటింటికీ వెళ్లి పెన్షన్ అందించిన ఎమ్మెల్యే మాధవి

12చూసినవారు
ఇంటింటికీ వెళ్లి పెన్షన్ అందించిన ఎమ్మెల్యే మాధవి
నూతన సంవత్సరం సందర్భంగా, ప్రభుత్వం 'ఎన్టీఆర్ భరోసా' పెన్షన్లను బుధవారం కడప నగరంలోని 22వ డివిజన్‌లో ఎమ్మెల్యే ఆర్. మాధవి లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి అందజేశారు. జనవరి 1 సెలవు దినం కావడంతో, బుధవారమే పెన్షన్ల పంపిణీ చేపట్టారు. ఈ ముందస్తు పంపిణీపై లబ్ధిదారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, శ్రీనివాసులు, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్