నందలూరు మండలం కుందానెల్లూరుకు చెందిన తుంటి ఎల్లయ్యకు సీఎం సహాయ నిధి కింద రూ.14 లక్షలు మంజూరయ్యాయి. అయితే, వేణుగోపాల్ అనే వ్యక్తి తన నుంచి రూ.8 లక్షలు తీసుకున్నాడని ముందుగా చెప్పిన బాధితుడు, ఆ తర్వాత తన కుటుంబం ఆసుపత్రిలో ఉన్నప్పుడు వేణుగోపాల్ నుంచి అప్పు తీసుకుందని, ఆ డబ్బులే అతడు తీసుకున్నాడని వెల్లడించారు. తనకు మైండ్ సరిగ్గా పనిచేయట్లేదని, తెలియక అప్పుడు అలా చెప్పానని చెప్పుకొచ్చారు.