యోగివేమన విశ్వవిద్యాలయం ఎంబీఏ శాఖలో బుధవారం నూతన విద్యార్థుల స్వాగత సభను హెచ్‌ఓడీ డా. సరిత ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్, విద్యార్థులు లక్ష్యంతో చదివి, వర్సిటీ వనరులను సద్వినియోగం చేసుకోవాలని, నైపుణ్యాలను పెంచుకుని క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. రిజిస్ట్రార్ పద్మ, ప్రిన్సిపల్ శ్రీనివాస్ క్రీడా విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.