నూతన సంవత్సరం సందర్భంగా గురువారం కడప శిల్పారామం జనసంద్రంగా మారింది. సాయంత్రం 4:30 గంటల నుండి జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి రాజేశ్ బృందం, కడప కళాకారులు ప్రదర్శించిన పల్లె జానపదాలు, శాస్త్రీయ, సినీ నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ఏఓ ఎస్. కృష్ణ ప్రసాద్ పర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకలను తిలకించేందుకు నగర ప్రజలు భారీగా తరలివచ్చి ఆనందించారు.