కడప కలెక్టరేట్‌లో
ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలను సాంస్కృతిక పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి
ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని చాటిన
ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయమని, ఆయన నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కలెక్టర్ కొనియాడారు.