ఒంటిమిట్ట: విద్యుత్ షాక్ తో బాలుడికి గాయాలు

5చూసినవారు
ఒంటిమిట్ట: విద్యుత్ షాక్ తో బాలుడికి గాయాలు
వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం చిన్నకొత్తపల్లిలో 11 కేవీ విద్యుత్ లైన్ తాకడంతో కట్టా లిఖిత్ కుమార్ (6) అనే బాలుడు  గాయపడిన ఘటన జరిగింది. దిత్వా తుపాను కారణంగా పాఠశాలలకు సోమవారం సెలవు ఉండడంతో ఒంటిమిట్టలోని ప్రైవేటు పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న అతను ఆటల కోసం బయటికి వెళ్లాడు. ఇంటి పక్కన ఉన్న ప్రహరీ గోడపై ఎక్కిన సమయంలో పక్కనే ఉన్న 11 కేవీ తీగలు తగిలి కిందపడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు.

సంబంధిత పోస్ట్