మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా, మంగళవారం సీకే దిన్నె ఎస్ఐ శ్రీనివాసులరెడ్డి శ్రీ చైతన్య స్కూల్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీసులు పోక్సో చట్టం, గుడ్ టచ్-బ్యాడ్ టచ్, సైబర్ నేరాలు, డయల్ 112 వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.