కడప తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం 15 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటనపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ప్రొద్దుటూరు నుంచి వచ్చిన రెడ్డిబాబు అనే వ్యక్తి బంధువుల ఇంట్లో ఉన్న బాలికపై ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. బాధితురాలి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.