కడపలో డ్రోన్ కెమెరాలతో పోలీసుల నిఘా

2చూసినవారు
కడపలో డ్రోన్ కెమెరాలతో పోలీసుల నిఘా
కడప నగరంలో గంజాయి, అసాంఘిక కార్యకలాపాలపై వన్ టౌన్ పోలీసులు డ్రోన్లతో డేగకన్ను వేశారు. ఎస్పీ నచికేత్ ఆదేశాలతో బుధవారం 7రోడ్స్, పాత బస్టాండ్ పరిసరాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. డ్రోన్ల ద్వారా అనుమానితులను పట్టుకుంటున్నారు. చట్ట వ్యతిరేక పనులపై సమాచారం ఉంటే వెంటనే 1972కు కాల్ చేయాలని కోరారు. సిబ్బంది ఈ దాడుల్లో చురుకుగా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్