కడప జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీసులు 'స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో' అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు, రాత్రి వేళల్లో ప్రయాణించే లారీ, కారు, బస్సు డ్రైవర్లను ఆపి, వారిని స్వయంగా ముఖం కడుక్కోమని సూచిస్తున్నారు. వాహనం నడిపేటప్పుడు కుటుంబ సభ్యుల గురించి ఆలోచించి, అప్రమత్తంగా ఉండాలని పోలీసులు డ్రైవర్లకు సూచిస్తున్నారు.