రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 7, 8 తేదీల్లో నిర్వహించనున్న కలెక్టర్ల సదస్సుకు జిల్లా ప్రగతి, అభివృద్ధి నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. మంగళవారం జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనాతో కలిసి ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. పీజీఆర్‌ఎస్, జలధార, వ్యవసాయం, ఆరోగ్యం, ఉపాధి కల్పన, పరిశ్రమల స్థాపన వంటి పనుల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.