కడప జిల్లాలో ఇసుక తవ్వకాలు, రవాణా పారదర్శకంగా ఉండాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. బుధవారం ఎస్పీ నచికేత్, జేసీలతో ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. వర్షాకాలంలో ఇసుక కొరత లేకుండా జాగ్రత్తలు చేపట్టాలని, పట్టా భూముల్లో ఇసుక డీ-కాస్టింగ్ అనుమతులపై నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. 4 లక్షల టన్నుల ఇసుక లక్ష్యంగా 8 రీచ్‌లకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు.