కొండాపురం మండలంలో శనివారం సాయంత్రం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురుగాలులు, చలిగాలులతో పాటు రాత్రి 9 గంటల నుంచి చిరుజల్లులతో వర్షం కురిసింది. ఈ అకాల వర్షం కారణంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా శనగ పంటకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.