నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో ఈరోజు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం గంటకు 13 కిలోమీటర్ల వేగంతో శ్రీలంక వైపు కదులుతోంది. ఈరోజు సాయంత్రంలోపు ట్రింకోమలీ-జాఫ్నా మధ్య తీరం దాటే అవకాశముందని అధికారులు వెల్లడించారు. తీర ప్రాంతాల్లో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించారు.