కోస్తా తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ, కృష్ణా, GNT, బాపట్ల, ప్రకాశం, NLR, కర్నూలు, కడప, TPT జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. తెలంగాణలో హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో నేటితో వర్షాలు ముగుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.