చేతి వృత్తిదారుల ఐక్య పోరాటానికి రామాంజనేయులు పిలుపు

0చూసినవారు
చేతి వృత్తిదారుల ఐక్య పోరాటానికి రామాంజనేయులు పిలుపు
చేతి వృత్తుల పరిరక్షణ, సామాజిక భద్రత, సంక్షేమమే లక్ష్యంగా చేతి వృత్తి దారులందరూ ఐక్యంగా ఉద్యమాలకు సిద్ధం కావాలని చేతి వృత్తి దారుల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామాంజనేయులు పిలుపునిచ్చారు. బద్వేల్ పట్టణంలో జరిగిన సమాఖ్య కడప జిల్లా విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పారిశ్రామిక విధానాల వల్ల చేతి వృత్తి దారులు దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారని, కొత్త సాంకేతిక పరికరాలు కొనుగోలుకు ప్రభుత్వ సహకారం లేకపోవడంతో పోటీలో నిలవలేకపోతున్నారని అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్, క్షవర వృత్తిదారుల సంఘం నాయకుడు కోడూరు కేశవ, గొర్రెల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.