శనివారం కడప–రామాపురం రహదారిపై మేదరపల్లి సమీపంలో బైక్, ఆటో ఢీకొన్న ప్రమాదంలో నల్లగుట్టపల్లెకు చెందిన నాగరాజు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. బాధితుడిని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రామాపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.