తనపై వస్తున్న ఆరోపణలను
వైసీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. పెద్దనాన్న వివేకా కేసుతో పాటు, కేజీ ఇసుక, కేజీ బేరైట్స్ అక్రమ రవాణా ఆరోపణలపై దేవుడి సన్నిధిలో ప్రమాణం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. నిజాయితీగా చెబుతున్నానని, ఎక్కడికి రమ్మన్నా వస్తానని ఆయన సవాల్ విసిరారు.