ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ నెల 5వ తేదీన కడప నగరానికి రానున్నారు. కడపలోని అమీన్ పీర్ పెద్ద దర్గాలో జరిగే ఉరుసు ఉత్సవాల సందర్భంగా నిర్వహించే గంధం వేడుకలో ఆయన పాల్గొంటారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరిగే ఈ ఉత్సవాలకు రెహమాన్ హాజరవుతారు. రేపు రాత్రి దర్గాలో జరిగే గంధ మహోత్సవం సందర్భంగా పీఠాధిపతితో కలిసి ఆయన దర్గాలో ప్రార్థనలు చేయనున్నారు.