ఎస్పీ ఆఫీసులో స్పందన.. 143 అర్జీల స్వీకరణ

2చూసినవారు
ఎస్పీ ఆఫీసులో స్పందన.. 143 అర్జీల స్వీకరణ
కడప జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె. ప్రకాష్ బాబు బాధితుల నుంచి మొత్తం 143 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును సావధానంగా ఆలకించి, చట్టపరిధిలో న్యాయం జరిగేలా చూడాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులకు పోలీసు సిబ్బంది సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ సుధాకర్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్