కార్తీక పౌర్ణమి సందర్భంగా, నవంబర్ 5వ తేదీ బుధవారం ఉదయం 6 గంటలకు కడప పాత బస్టాండ్ నుంచి పుష్పగిరి గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి ప్రత్యేక ఆర్టీసీ బస్సు సౌకర్యం అందుబాటులో ఉంటుందని కడప డిపో మేనేజర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీ పుష్పగిరి తీర్థక్షేత్ర ధర్మ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు బారవి అభ్యర్థన మేరకు ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు ఈ బస్సులను వినియోగించుకోవాలని కోరారు.