వర్షాకాలం దృష్ట్యా ప్రజలకు ఇసుక కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశంలో, మార్గదర్శకాల మేరకు జూన్ 1 నుంచి అక్టోబర్ 15 వరకు నదుల్లో ఇసుక తవ్వకాలు నిలిపివేసి, కేవలం స్టాక్ యార్డుల్లోని ఇసుకనే సరఫరా చేయాలని నిర్ణయించారు. రవాణా, సరఫరా వ్యవస్థలు పారదర్శకంగా జరగాలని అధికారులకు సూచించారు.