కడప అమీన్ పీర్ పెద్ద దర్గా ఉరుసు సందర్భంగా, ఈనెల 5వ తేదీ బుధవారం కడపలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు విద్యాశాఖ అధికారులు సెలవు ప్రకటించారు. పెద్ద దర్గాలో గంధం మహోత్సవం జరగనున్నందున, విద్యా శాఖ దీనిని లోకల్ హాలిడేగా ప్రకటించింది. పాఠశాల యాజమాన్యాలకు ఈ విషయాన్ని అధికారులు తెలియజేశారు.