టీడీపీ సీనియర్ కార్యకర్త మృతి

తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త పాలడుగు రామానాయుడు (67) మంగళవారం కన్నుమూశారు. కడప నగరంలో ఎన్టీఆర్ వేషధారణలో సైకిల్‌పై తిరుగుతూ టీడీపీకి ప్రతీకగా నిలిచిన ఆయన, పార్టీ ఆవిర్భావం నుంచే సేవలందించారు. చిన్నచౌకు కొండాయపల్లిలోని తన నివాసంలో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన ఆయన మృతి పట్ల టీడీపీ నాయకులు విచారం వ్యక్తం చేశారు.
