వల్లూరు మండలంలోని తప్పెట్ల కొత్తపల్లెలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన లేబక విక్రాంత్ రెడ్డి (14) అనే 9వ తరగతి విద్యార్థి బుధవారం ఉదయం 6 గంటలకు తన సొంత షాపునకు వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.