సచివాలయ ఉద్యోగులకు షాక్: పాస్ కాకుంటే ఇంక్రిమెంట్ కట్

8చూసినవారు
సచివాలయ ఉద్యోగులకు షాక్: పాస్ కాకుంటే ఇంక్రిమెంట్ కట్
కడప జిల్లా సచివాలయాల్లోని పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, మహిళా పోలీస్ సహా 8 రకాల సిబ్బందికి ఎన్ఎస్ఈఐటి పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి అని గ్రామ, వార్డు సచివాలయ అధికారి మైథిలి తెలిపారు. పరీక్ష రాయకపోయినా లేదా ఉత్తీర్ణత సాధించకపోయినా, తదుపరి వార్షిక ఇంక్రిమెంట్ నిలిపివేయబడుతుందని ఆమె పేర్కొన్నారు. పాసైన తర్వాత కూడా ఆధార్ సేవలను అందించడానికి నిరాకరించే డిజిటల్ అసిస్టెంట్లకు కూడా ఇంక్రిమెంట్ కోత తప్పదని, అందరూ వెంటనే పరీక్షకు నమోదు చేసుకోవాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్