కడప వన్‌టౌన్ పరిధిలోని ఎర్రముక్కపల్లెలో ఆస్తి వివాదంతో భాస్కర్ అనే వ్యక్తి ఇంటిని అక్రమంగా కూల్చివేసిన ఘటనలో పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. తిరుపతికి చెందిన వెంకటసుబ్బారెడ్డి వర్గీయులు ఈ నెల 26న రాత్రి పొక్లెయిన్‌తో ఇంటిని ధ్వంసం చేశారు. అడ్డువచ్చిన బాధితులను కులం పేరుతో దూషించడంతో నిందితులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. ఘటనకు వాడిన పొక్లెయిన్‌ను సీజ్ చేశామని, పరారీలో ఉన్న మిగతా వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.