కడప జిల్లా పోలీస్ శాఖలో సుదీర్ఘ కాలం నిబద్ధతతో పనిచేసి పదవీ విరమణ పొందిన ప్రొద్దుటూరు వన్ టౌన్ ఎస్ఐ కె. పి. బి వెంకట రెడ్డి, చిన్నచౌకు ఏఎస్ఐ ఎ. ఎస్ ప్రసాద్‌లను జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. విధి నిర్వహణలో వారి తెగువను ఎస్పీ కొనియాడారు. రిటైర్మెంట్ తర్వాత ఆరోగ్యంపై శ్రద్ధ వహించి, కుటుంబంతో సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. పెన్షన్ బెనిఫిట్స్ త్వరగా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.